కోనసీమ వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు
కోనసీమలో క్రిస్మస్ వేడుకలను బుధవారం క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఏసుక్రీస్తును ఆరాదించు మానవాలిని కాపాడడానికి భూమిమీద జన్మించిన రోజు క్రిస్మస్ అని పేర్కొన్నారు. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక కర్మేలు ప్రార్థనా మందిరంలో రెవజీఎజ్రా పాస్టర్ నెహమ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తును స్మరిస్తూ ప్రార్థనాగీతాలు ఆలపించారు.