మండపేటలో దోమల నివారణకు చర్యలు
మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి, కమిషనర్ టీవీ రంగారావు ఆదేశాల మేరకు పబ్లిక్ హెల్త్ వర్కర్ లు బుధవారం పట్టణంలో దోమల నివారణ చర్యలు చేపట్టారు. పట్టణంలోని 30 వార్డుల్లోని డ్రైనేజీలలో ఆయిల్ బాల్స్ ను, యాంటీ లార్వా కెమికల్స్ ను పిచికారీ చేశారు. సానిటరీ ఇన్స్పెక్టర్ ఎం. సత్తిరాజు పర్యవేక్షణలో సానిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు, సానిటరీ మేస్త్రిలు సూపర్వైజర్ లు పాల్గొన్నారు.