అపర్ణ దేవి అమ్మవారిని దర్శించుకున్న నిమ్మకాయల చినరాజప్ప
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలోని అపర్ణ దేవి అమ్మవారిని శనివారం మాజీ హోంమంత్రి, పెద్దాపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆకొండి ప్రభాకర శాస్త్రి అపర్ణాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయేది కూటమి ప్రభుత్వమేనని తెలియజేశారు.