

రంపచోడవరం: రెండు గంటల వ్యవధిలోనే కిడ్నాప్ ను చేధించిన పోలీసులు
రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో మంగళవారం జరిగిన ఓ పసికందు కిడ్నాప్ ను పోలీసులు చేధించారు. వై.రామవరం మండలం దుంపవలసకు చెందిన సాధన ఏరపురెడ్డి, కళావతి దంపతులకు గుర్తేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 5 రోజుల క్రితం ఓ మగబిడ్డ జన్మించారు. బరువు తక్కువ ఉందని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. అయితే ఓ మహిళ ఆసుపత్రి సిబ్బంది వేషంలో వచ్చి పసికందును ఎత్తుకెళ్లింది. ఈ కేసును పోలీసులు రెండు గంటల్లోనే చేధించారు.