

గంగవరం: జోరుగా కోడిపందాలు
గంగవరం మండలంలోని జగ్గంపాలెం శివారులో జోరుగా కోడిపందేలు సాగుతున్నాయి. కోడిపందాల శిబిరాల్లో లక్షల్లో వేలల్లో బెట్టింగ్ జరుగుతున్నాయి. మంగళవారం నుంచి పెద్ద ఎత్తున కోళ్ల పందేలు శివారు ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నాయని స్థానిక గిరిజనులు మండిపడుతున్నారు. ఆయా ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వెళ్తున్నారని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించాలని గిరిజనులు కోరుతున్నారు.