

వై. రామవరం: అంగన్వాడి భవన నిర్మాణం పూర్తి చేయాలి
అల్లూరి జిల్లా వై. రామవరం మండలంలోని గుమ్మరపాలెం గ్రామంలో అంగన్వాడి భవనం నిర్మాణం పూర్తి చేయాలని గిరిజనులు మంగళవారం డిమాండ్ చేశారు. గ్రామస్తుడు మాట్లాడుతూ. 2016 సంవత్సరంలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులు చేపట్టి అర్ధాంతరంగా విడిచి పెట్టేసారన్నారు. దీంతో 30 మంది చిన్నారులకు ఓనమాలు నేర్పించేందుకు ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి అంగన్వాడి భవన నిర్మాణం పూర్తి చేయాలన్నారు.