గత ప్రభుత్వం తీర్చలేని సంక్షోభంలోకి నెట్టేసింది: ఎమ్మెల్యే
భీమవరం 6వ వార్డు తాడిమళ్ళ లక్ష్మి నరసమాంబ పురపాలక ప్రత్యేక పాఠశాలలో శుక్రవారం " ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకులు మోది బాబు, పవన్ లని, అనేక సంక్షేమ పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయని, గత ప్రభుత్వం 20 ఏళ్లు అయినా అప్పు తీర్చలేని సంక్షోభంలోకి నెట్టేసిందని విమర్శించారు.