ఈపూరు: పొలం పిలుస్తుంది కార్యక్రమం
ఈపూరు మండలంలోని కొండ్రముట్ల, బోడెపూడి వారి పాలెం గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం గురువారం జరిగింది. కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి రామారావు హాజరై ఆయా గ్రామాలను రైతులతో కలిసి పొగాకు పంటను పరిశీలించి , పంట యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించి అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ పంటలపై వచ్చే తెగుళ్ల నివారణకు సందేహాలను వ్యవసాయ అధికారులకు తెలియజేశారు.