

వేంపల్లి: తెలుగుదేశం.. ఇంగ్లిష్ దేశమైంది: తులసి రెడ్డి
తెలుగు జాతి, భాష, ఆత్మగౌరవం కోసం 43 ఏళ్ల కిందట నందమూరి తారకరామారావు టీడీపీని స్థాపించారని ఏపీసీసీ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి అన్నారు. శనివారం ఆయన వేంపల్లి లో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఉన్నంత కాలంలో అటు రాష్ట్రం, ఇటు టీడీపీలో ఆ స్ఫూర్తి కొనసాగిందన్నారు. ఎన్టీఆర్ మరణానంతరం రాష్ట్రంలో, పార్టీలో ఆత్మగౌరవం, తెలుగు జాతి అంశాలు రివర్స్ అయ్యాయన్నారు. తెలుగుదేశం, ఇంగ్లిష్ దేశంగా మారిందని తులసి రెడ్డి విమర్శించారు.