
పులివెందుల: నడిరోడ్డుపై అడ్డంగా బైకులు
పులివెందుల పట్టణంలోని మెయిన్ బజార్లో శుక్రవారం రోడ్డుకు అడ్డంగా బైకులు పెట్టడంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. బైకుల అడ్డుతో వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెడుతున్నా ట్రాఫిక్ పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు స్పందించి వాహనాలు పెట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.