నేడు జిల్లాలో అతి భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో మరో సారి భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 24 గంటల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. అల్లూరి సీతారామరాజు, తూగో, పగో, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.