గణేష్ నిమజ్జనం చేసే ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్పీ
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్ద, కాలేఖాన్ పేట మంచినీళ్ల కాలువ, పెడన, గూడూరు అడ్డరోడ్డు వద్ద గల గణేష్ నిమజ్జనం చేసే ప్రాంతాన్ని పోలీస్ అధికారులతో కలిసి ఎస్పీ ఆదివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. నిమజ్జనం ప్రాంతాల్లో ప్రమాదాలకు తావు లేకుండా పోలీసు వారు ముందస్తుగా తీసుకున్న ఏర్పాట్లన్నిటిని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు.