ఎన్టీఆర్: దేవినేని అవినాష్ అరెస్ట్
రైతుల సమస్యలపై వైసీపీ శుక్రవారం నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తో పాటు మరికొందరు వైసీపీ నేతలను పోలీసులు నడిరోడ్డుపై అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.