పార్వతీపురం: తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి
తుఫాను పట్ల జిల్లా యంత్రాంగంగం అప్రమత్తంగా ఉండాలని మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. వాతావరణ శాఖ సూచనలు మేరకు 23 నుండి 26వ తేదీ వరకు ఉత్తరాంధ్రలో తుఫాను మూలంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా, మండల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదల పరిస్థితిని గమనించాలని చెప్పారు. వసతి గృహాలను తనిఖీ చేయాలని, శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఎవరూ ఉండరాదని ఆయన ఆదేశించారు.