ఆదోని: ఇంధన పొదుపుతో మంచి భవిష్యత్: ఎమ్మెల్యే
ఇంధనం పొదుపు చేయడం ద్వారా భావితరాలకు మంచి భవిష్యత్ ఇవ్వవచ్చని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. బుధవారం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు - 2024 లో భాగంగా ఆదోని మున్సిపల్ గ్రౌండ్ ఆవరణం నుండి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ జండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ కె. కృష్ణ, ఏఈ ఇంజనీర్ హరీష్ పాల్గొన్నారు.