ఆదోని: రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి మృతి
బైక్ పై నుంచి పడి సచివాలయ ఉద్యోగి గిడ్డయ్య (32) మృత్యువాత పడ్డాడు. గుడేకల్లు సచివాలయంలో లెన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన నారాయణపురంలోని అతని అత్తగారింటికి శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని వెళ్తుండగా బైక్ అదుపు తప్పిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా శనివారం ఆసుపత్రిలో కోలుకోలేక మృతి చెందాడు. కాగా ఇటీవల అతని భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది.