కల్వకుర్తి: మా ఇండ్లు మాకు ఇవ్వండి
మా ఇండ్లు మాకు ఇవ్వాలని కల్వకుర్తిలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు సోమవారం తమ చాట, బుట్ట, పొరకలతో వినూత్నంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ముందు నిరసన వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు పంపిణీ చేసి ఇంటి పత్రాలు ఇవ్వాల్సి ఉండగా లేట్ చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లక్కీ డీప్ ద్వారా లబ్ధిదారుల కేటాయించిన ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.