నాగర్ కర్నూల్: అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం నిరసన తెలిపింది. సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ, జాబ్ కార్డుతో సంబంధం లేకుండా గ్రామ సభల ద్వారా వ్యవసాయ కార్మికులను గుర్తించి ప్రభుత్వం 12వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సి. ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు పి. బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.