పాతపట్నంలో ఏ పార్టీ గెలుస్తుంది?
శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గంలో 1952 నుండి 2019 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 7 సార్లు కాంగ్రెస్, 6 సార్లు టీడీపీ, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇండిపెండెంట్ ఒకసారి గెలుపొందింది. 2014, 2019లో వైసీపీ విజయం సాధించగా.. ఈ సారి కూడా హ్యాట్రిక్ వైపు దూసుకెళ్తుందని వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి ధీమాగా ఉండగా, టీడీపీ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు, కాంగ్రెస్ అభ్యర్థి కొప్పురోతు వెంకటరావు తమదే గెలుపంటూన్నారు. పాతపట్నంలో గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా మారనున్నది.