తిరుపతి: వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు: అదనపు ఈవో
తిరుమలలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని పలు ప్రాంతాలను అదనపు ఈవో, జెఈవో వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్వో శ్రీధర్తో కలిసి పరిశీలించారు.