పది రోజుల్లో వ్యవధిలోనే భార్యాభర్తల మృతి
కొమరాడ మండలంలోని బట్టివలస గ్రామంలో పది రోజుల వ్యవధిలో భార్యా భర్తలు మృతిచెందారు. మెల్లిక సుబ్బా రావు(40) పది రోజుల కిందట తన పొలంలో పురుగు మందు పిచికారీ చేస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. పార్వతీపురం వైద్యశాలకు తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందాడు. ఈ ఘటన జరిగి పది రోజులు కాగాముందే భార్య మెల్లిక పార్వతి(35) అనారోగ్యంతో శుక్రవారం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది.