పాలకొల్లు: రోడ్డుపక్కన హోటల్లో టిఫిన్ తిన్న మంత్రి రామానాయుడు
రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం పాలకొల్లు నుంచి విజయవాడకు ప్రయాణిస్తూ మార్గమధ్యలో ఓడూరు రోడ్డు వైపున ఉన్న చిన్న కాఫీ హోటల్ వద్ద ఆగి టిఫిన్ చేసారు. ఈ నేపథ్యంలో అక్కడకు వచ్చిన ప్రజలను కూటమి పరిపాలన తీరుతురులపై ప్రజాభిప్రాయానికి తెలుసుకున్నారు. జనం నుంచి సానుకూలమైన సమాధానాలు రావడంతో సంతోషించారు. మంత్రి అయి ఉండి అతి సామాన్యుడిలా టిఫిన్ చేయడం స్థానికంగా చర్చనీయాంశం అయింది.