కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలి
కౌలు రైతుల రుణాలను రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని, 2023 సంవత్సరానికి సంబంధించి పంట నష్టం అందించాలని తదితర డిమాండ్ లు పరిష్కరించాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు గాడి అప్పారావు బుధవారం కొత్తవలస మండలం నిమ్మలపాలెంలో గల సచివాలయ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. తక్షణమే ప్రభుత్వం జీవో నెంబర్ 22 రద్దు చేసి కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో కౌలు రైతులు పాల్గొన్నారు.