101 ఏళ్ల వయసులో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు
తక్కువ తినండి, ఎక్కువ కదలండి అని విశాఖకు చెందిన నావికా దళ యోధుడు, క్రీడాకారుడు 101 ఏళ్ల వల్లభజోస్యుల శ్రీరాములు చెపుతున్నారు. ఇటీవల స్వీడన్లో జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మూడు బంగారు పతకాలు సాధించారు. 100 ఏళ్ల విభాగంలో పోటీ పడుతున్న అతను జావెలిన్ త్రో, డిస్కస్ త్రో మరియు షాట్పుట్లలో ప్రతిభ కనబరిచారు. ఈ ఆయన సాధించిన విజయాలను ఆదివారం మీడియాతో పంచుకున్నారు.