చోడవరం: ఎమ్మెల్యే కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు
చోడవరంలో నూతన సంవత్సర వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎం ఎస్ రాజు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. నియోజవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు హాజరై ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక పత్రిక విలేకరులు కూడా ఎమ్మెల్యేని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.