భీమవరం: మావుళ్ళమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్
భీమవరం పట్టణ ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ ఆలయములో పృథ్వీ శ్రీ చక్రము వేసి, శ్రీ చక్రార్చన పూజలను ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ దేవి ఖడ్గమాల, ఆ తదుపరి శ్రీలలిత సహస్ర నామ పారాయణ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.