ఉమ్మడి జిల్లా నేతలతో జగన్ సమీక్ష
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జడ్పీటీసీలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. అలాగే మనమందరం కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీని మరింత పటిష్టంగా చేసుకుందామన్నారు.