మనమేమి రాచరికంలో లేము: ఎమ్మెల్యే
అత్తిలి గ్రామంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడుతూ. మనమేమి రాచరికంలో లేమని ప్రజాస్వామ్యంలో ఉన్నామని అన్నారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖర్చులు తగ్గించుకొని కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. కావున పంచాయతీలపై భారం పడకుండా ఖర్చులు తగ్గించుకొని కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.