వయేర్యుకు భారీగా వరద నీరు
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వయేర్యుకు వరద నీరు చేరుతోంది. తణుకు మండలం దువ్వ వయ్యేరు రెగ్యులేటర్ వద్ద ఆదివారం సాయంత్రానికి నీటి మట్టం 9 అడుగులకు చేరుకుంది. ఎగువున కొంగువారిగూడెం ప్రాజెక్టు నుంచి 2500 క్యూసెక్కులు, బయనేరు, జల్లేరు తదితర వాగుల నుంచి 500 క్యూసెక్కులుఇతర కాలువల నుంచి నందమూరు అక్విడక్టుకు మొత్తం 5000 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో యనమదుర్రు డ్రెయిన్ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.