ఏలూరు జడ్పీ కార్యాలయంలో "స్వచ్ఛత హీ సేవ 2024" కార్యక్రమం
ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో "స్వచ్ఛత హీ సేవ 2024" కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆమె చీపురుతో జడ్పీ కార్యాలయంలోని పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం వారంతా ప్రతిజ్ఞ చేశారు. అలాగే ప్రజలందరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు.