

బద్వేలులో రంజాన్ ప్రార్థనలు
కడప జిల్లాలోని బద్వేల్ రోడ్డులోని ఈద్గాలో రంజాన్ సందర్భంగా సోమవారం ఉదయం నుంచి ముస్లిం పెద్దలతో పాటు, పట్టణానికి చెందిన ముస్లింలు ఈద్గా ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్కు అంతరాయం లేకుండా బద్వేల్ అర్బన్ సీఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.