బాధిత కుటుంబానికి చెక్కు అందజేత
పెండ్లిమర్రి మండలం గంగనపల్లికె చెందిన దాసరి శివాన్ కు రూ. 1 లక్షల సీఎం సహాయ నిధి మంజూరైంది. శివాన్స్ పేగు సంబంధిత సమస్యతో అనారోగ్యపాలై ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో తమ దీనస్థితిని మంత్రి రాంప్రసాద్ రెడ్డికి వివరించారు. మంత్రి ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధిని మంజూరు చేయించారు. అందుకు సంబంధించిన పత్రాన్ని గురువారం ఉదయం మంత్రి బాధిత తండ్రి చంద్రశేఖర్ కు అందించారు.