ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణ పోలీస్
తెలంగాణ పోలీసింగ్ ఇతర రాష్ట్రాల పోలీసులకు రోల్ మోడల్‌గా మారిందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. 2022-24 బడ్జెట్లో హోంశాఖకు రూ. 9,599 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర పోలీసులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక అవార్డులు అందుకున్నారని గుర్తు చేశారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 9.8 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిందన్నారు.