2014లో ప్రారంభమైన స్విగ్గీ
ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని, ఆహారాన్ని వినియోగదార్లకు సరఫరా చేసే డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ భారీ పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైంది. తొలి పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా రూ.3,750 కోట్లు సమీకరించనుంది. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ పెట్టుబడులున్న ఈ సంస్థను 2014లో స్థాపించారు. దేశంలోని 15,000 రెస్టారెంట్లతో స్విగ్గీకి ఒప్పందం ఉంది.