అంతరిక్షం నుంచే ఓటు వేయనున్న సునీతా విలియమ్స్
బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమమ్స్, బుచ్ విల్మోర్ తాజాగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల గురించి ప్రస్తావించారు. తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పారు. అమెరికా పౌరురాలిగా ఓటు హక్కు వినియోగించుకోవడం తన కీలక బాధ్యత అని చెప్పారు. బ్యాలెట్ పేపర్ల కోసం అభ్యర్థన పంపించామని పేర్కొన్నారు.