

చైనాలో ఫ్లయింగ్ టాక్సీలకు అనుమతి (వీడియో)
చైనా పౌర విమానయాన విభాగం (CAAC) ఫ్లయింగ్ టాక్సీలకు అనుమతి ఇచ్చింది. ఈ చర్యతో, ప్రయాణాల భవిష్యత్తులో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇహాంగ్ (EHang), హెఫీ హేలి ఎయిర్లైన్స్ సంస్థలు పైలట్ లేకుండానే ఫ్లయింగ్ టాక్సీలను నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ పొందాయి. ఈ స్వయంచాలిత ఎయిర్ టాక్సీలు నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు, వేగంగా ప్రయాణించే అవకాశాన్ని అందించనున్నాయి.