Top 10 viral news 🔥
TG: సన్న వడ్లకు రూ.500 బోనస్.. కేబినెట్ ఆమోదం
తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో సన్న వడ్లకు క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సన్నవడ్ల సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు పెడతామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే ధాన్యం సొమ్ము 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.