

అది మన తెలుగోళ్ల సత్తా: సీఎం చంద్రబాబు
అమెరికన్ల తలసరి ఆదాయం 60 వేల డాలర్లు అయితే అక్కడున్న మన ఐటీ నిపుణుల ఆదాయం 1,20,000 డాలర్లు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 'అమెరికన్ల కంటే రెట్టింపు ఆదాయాన్ని మనవాళ్లు పొందుతున్నారు. అమెరికన్ల కంటే తెలివైనవాళ్లు మన పిల్లలు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశం వెళ్లి చూసినా అక్కడ కచ్చితంగా మన భారతీయులు అందులోనూ మన తెలుగువాళ్లు ఉంటారు. అది మన సత్తా' అని చంద్రబాబు పేర్కొన్నారు.