ఆదిలాబాద్
ఆదిలాబాద్: క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి
క్యాన్సర్ వ్యాధిపై ప్రజలు సైతం అవగాహన కలిగి ఉండాలని డిఎంహెచ్ఓ కృష్ణ సూచించారు. పాలియేటివ్ కేర్ వారోత్సవాల్లో భాగంగా శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ పాలియేటివ్ కేర్ వార్డులో క్యాన్సర్ బాధితులకు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ తో కలిసి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడుగు తెలుస్తున్నారు. క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తించి అవసరమైన చికిత్సను తీసుకోవాలని వారు సూచించారు.