జడ్చర్ల: డివైడర్ ని ఢీకొన్న కారు.. ట్రాఫిక్ అంతరాయం
జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీ కొట్టిన ఘటన జడ్చర్ల నియోజకవర్గం గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం బాలానగర్ మండల కేంద్రంలో జడ్చర్ల నుంచి షాద్ నగర్ వెళ్తున్న ఓ డివైడర్ ను ఢీ కొట్టింది. కారు వెనుక భాగం దెబ్బతింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో మండల కేంద్రంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఇటీవల కాలంలో తరచు ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో మండల కేంద్రంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.