మహబూబ్ నగర్: కొత్త పథకాలు ఓ అద్భుతం: మంత్రి రాజనర్సింహ
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించబోయే నాలుగు పథకాలు ఓ అద్భుతమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ. సంక్షేమ పథకాల అమలులో గ్రామ సభలలో ఎమ్మెల్యేలు, ఇందిరమ్మ కమిటీలను భాగస్వాములను చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రచార,ప్రచారం, సమన్వయం లోపం ఉండకూడదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పథకాలను అమలు చేయాలన్నారు.