జడ్చర్ల: 12 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో నూతన సంవత్సరం సందర్భంగా మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడిపిన వ్యక్తులను పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు నిర్వహించారు. తనీఖీలో 12 మంది పట్టుబడ్డారని బుధవారం ఎస్ఐ తిరుపాజీ తెలిపారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.