మహబూబ్ నగర్ క్రికెట్ జట్టు తమిళనాడు ప్రయాణం
సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు క్రికెట్ పురుషుల జట్టు తమిళనాడుకు బుధవారం ప్రయాణం అయ్యారు. ఈ మేరకు క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. మంచి ప్రతిభ కనబరిచి పాలమూరు యూనివర్సిటీకి పేరు తీసుకురావాలని యూనివర్సిటీ ఉపకులపతి జిఎన్. శ్రీనివాస్ అన్నారు. ఈ పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ బషీర్ అహ్మద్, పిడి శ్రీనివాసులు, కోచ్లు తదితరులు పాల్గొన్నారు.