జడ్చర్ల వంద పడకల ఆసుపత్రిలో సౌకర్యాలు పెంచండి: ఎమ్మెల్యే
జడ్చర్లలోని వంద పడకల ఆసుపత్రిలో సౌకర్యాలు పెంచాలని రోగులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి కావలసిన ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. వంద పడకల ఆసుపత్రిలో సౌకర్యాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.