మహబూబ్ నగర్: సాహిత్య సమాలోచన కార్యక్రమంలో పాల్గొనండి
మహబూబ్ నగర్ పట్టణంలోని వాగ్దేవి కళాశాలలో తెలంగాణ సాహితి సంస్థ ఆధ్వర్యంలో జరిగే సాహిత్య సమాలోచన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ సాహితి కార్యదర్శి వహీద్ ఖాన్, అధ్యక్షుడు భానుచందర్ శనివారం కోరారు. ఈ సాహిత్య సమాలోచన కార్యక్రమంలో కవి సమ్మేళనం కూడా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన కవులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని కవితలు వినిపించాలని కోరారు.