అక్రమంగా నిలువ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మాచాపూర్ లోని శ్రీ రేణుకా రైస్ మిల్లులో అక్రమంగా నిలువ ఉంచిన 166 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులు గురువారం దాడి చేసి పట్టుకున్నారు. బియ్యాన్ని కోరుట్ల ఎం ఎల్ ఎస్ గోదాం కు, లారీని మేడిపల్లి పోలీసు స్టేషన్ కు తరలించి మిల్లర్ పై 6 ఏ కేసు నమోదు చేసినట్టు జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు.