అమరచింత: ఎల్ఓసి పత్రం అందించిన ఎమ్మెల్యే
అమరచింత మండలం కిష్టంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సలు తీసుకుంటున్నాడు. ప్రభుత్వం నుండి ఆర్థికంగా ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం నుండి మంజూరైన రూ. 5 లక్షల విలువైన ఎల్ఓసి పత్రాన్ని ఎమ్మెల్యే బాధిత కుటంబ సభ్యులకు మంగళవారం అందించారు. మెరుగైన చికిత్సలు చేయించాలని చెప్పారు.