ఢిల్లీలోని షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)
ఢిల్లీలోని లారెన్స్ రోడ్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ షూ ఫ్యాక్టరీలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీ ఫ్యాక్టరీ పైఅంతస్తు నుంచి దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.