ఆసిఫాబాద్
వాంకిడి: నీళ్ల బకెట్లో పడి బాలుడు మృతి
వాంకిడి మండలంలోని తేజాపూర్ గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు పది నెలల బాలుడు నీళ్ల బకెట్లో పడి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం. తేజాపూర్ గ్రామానికి చెందిన గిర్మాజీ - సునీత దంపతుల కుమారుడు ఆడుకుంటూ వెళ్లి బాత్ రూమ్ లో ఉన్న బకెట్లో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి బాలుడు మృతి చెంది కనిపించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్సై పోశెట్టి తెలిపారు.