Top 10 viral news 🔥
అల్లు అర్జున్‌కి స్పెషల్ గిఫ్ట్ పంపిన రష్మిక
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి హిరోయిన్ రష్మిక ఓ స్పెషల్ గిఫ్ట్ పంపించింది. ఈ విషయాన్ని స్వయంగా బన్నీ సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశాడు. "ఎవరికైనా మనం వెండి బహుమతిగా ఇస్తే వాళ్లకు అదృష్టం కలిసి వస్తుందని మా అమ్మ చెప్పేది. ఈ చిన్న వెండి వస్తువు, స్వీట్స్, మీకు మరింత లక్, పాజిటివిటీ, ప్రేమ అందిస్తాయని నమ్ముతున్నా, మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు" అని రష్మిక ఓ లేఖ పంపింది.